FbTelugu

ఏపీకి బయల్దేరిన మత్స్యకారులు

గుజరాత్ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు బయలుదేరుతున్నారు. ఏపీ సీఎం జగన్, ఇతర కేంద్ర రాష్ట్ర నాయకులు జరిపిన మంతనాల ఫలితంగా.. ఇవాళ గుజరాత్ నుంచి 4,065 మంది మత్స్యకారులు ఏపీకి బయలు దేరుతున్నారు.

వారు గుజరాత్ నుంచి స్వస్థలాలకు రాగానే.. వారికి ఆర్థిక సాయం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వారి రవాణా ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని కరోనా కేసులపై రివ్యూ నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.