FbTelugu

ఏపీకి చేరిన మత్స్యకారులు

కృష్ణా: గుజరాత్ లో చిక్కుకు పోయిన ఆంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. మొత్తం 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులో జగ్గయ్యపేట చేరుకున్నారు. వీరికి విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్ ఘటన స్వాగతం పలికారు.

మత్స్యకారులు గత పది రోజులుగా గుజరాత్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ.. తమను ఏపీ పంపించండి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మరియూ ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో స్పందించి కేంద్ర మంత్రులు, గుజరాత్ ముఖ్యమంత్రితో మంతనాలు జరిపారు. ఫలితంగా ఇవాళ మత్స్యకారులు ఏపీకి చేరుకున్నారు.

You might also like