FbTelugu

కాళేశ్వరంలో మత్స్య సంపద

పెద్దపల్లి: కాళేశ్వరం జలాల్లో మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెందుతోంది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేశారు. ఈ సమయంలో మంథని గోదావరి తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేపలు చిక్కుతున్నాయి.

పెద్ద ఎత్తున చేపలు లభ్యంకావడంతో మత్స్యకారులు వాటిని వల విసిరి పట్టుకుంటున్నారు. టన్నుల కొద్ది పడుతున్న చేపలను గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లలో విక్రయిస్తున్నారు. మీనా రకం చేపలు ఒక్క కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క చేప బరువు రెండు నుంచి మూడు కిలోలకు పైగా ఉండడంతో ప్రజలు ఆనందంతో కొనుగోలు చేస్తున్నారు. అక్కడికక్కడే వాటిని శుభ్రం చేసి ఇస్తున్నామని మత్స్యకారులు తెలిపారు.

You might also like