FbTelugu

ఎన్ఆర్ఐ కి తొలి వ్యాక్సిన్

లండన్: యునైటెడ్ కింగ్ డమ్ లో నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఫైజర్-బయో ఎన్ టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ కు అనుమతి లభించిన విషయం తెలిసిందే.

ఇవాళ్టి నుంచి వైద్య సిబ్బందికి, 80 ఏళ్లు నిండి వారికి, హోం కేర్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. భారత సంతతికి చెందిన హరి శుక్లా అరుదైన ఘనతను సొంతం చేసుకుంటున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న మొదటి వ్యక్తుల జాబితాలో ఆయన చేరారు. వైద్య సిబ్బంది తనకు ఫోన్ చేసి వ్యాక్సిన్ తీసుకునేవారి తొలి జాబితాలో మీ పేరు ఉందని చెప్పడంతో ఉద్వేగానికి గురయ్యానని శుక్లా తెలిపారు.

కరోనా సంక్షోభానికి ముగింపునకు వ్యాక్సిన్ వచ్చిందని, ఈ విషయం తలచుకుంటేనే ఆనందంగా ఉందన్నారు. మొదటి వారంలో 8 లక్షల డోసులను వినియోగంచనున్నారు. ఈ సందర్భంగా యూకె ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, వైరస్ పోరాటంలో యూకె నేడు అతిపెద్ద అడుగు వేయబోతున్నదని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.