న్యూయార్క్: క్వీన్స్లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్లో క్రిటికల్ కేర్లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్సే తొలి వ్యాక్సిన్ డోసును ఇచ్చారు. దీంతో ఆమె తొలి వ్యాక్సిన్ తీసుకున్న నర్సుగా గుర్తింపు లభించింది.
దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ తో ఉపశమనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. దీని రాకతో అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగింపునకు దీన్నో నాందిగా భావిస్తున్నానని నర్సు అన్నారు. ఇది సురక్షితమైందేనని ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్ కొవాక్స్ కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వడంతో అధికారులు సోమవారం నుంచి పంపిణీ మొదలు పెట్టారు.