FbTelugu

90ఏళ్ల వృద్ధ మహిళకు తొలి వ్యాక్సిన్

హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వం తొలి ఫైజర్ వ్యాక్సిన్ ను వృద్ధ మహిళకు ఇచ్చింది. నార్త్ ఐర్లాండ్ లోని ఎన్నిస్ కిల్లెన్ ప్రాంతానికి చెందిన మార్గరేట్ కీనన్ (90) కు వ్యాక్సిన్ ఇచ్చారు.

ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కోవెంట్రీ యూనివర్సిటీ హాస్పిటల్ కీనన్ కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  దీంతో బ్రిటన్ లో సామూహిక వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. దీన్ని తన బర్త్ డే కానుకగా భావిస్తున్నట్లు మార్గరేట్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో తొలుత 80 ఏళ్లు దాటిన వారితో పాటు హెల్త్ కేర్ స్టాఫ్ కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల మందికి రెండు డోసుల చొప్పున ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతించిన బ్రిటన్, ఇది తప్పనిసరి కాదని కూడా స్పష్టం చేసింది. దేశంలో రెండు కోట్ల జనాభా ఉండగా, 8 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.