FbTelugu

కేరళ బరిలో తొలి ట్రాన్స్ జెండర్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తొలిసారి ట్రాన్స్ జెండర్ అనన్య అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ట్రాన్స్ జెండర్లు, స్త్రీలకు కనీసం గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న ప్రత్యర్థికి బుద్దిచెప్పడానికే పోటీ చేస్తున్నట్లు అనన్య ప్రకటించింది.
వెంగర్ నియోజకవర్గం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున పికె.కున్హాలి కుట్టి పోటీ చేస్తున్నారు.

ఆ పార్టీకి ఆయన వెన్నుముక లాంటివాడు. ఈయనను ఎదుర్కొవడానికి అనన్య డెమొక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున నామినేషన్లు వేస్తున్నది. ఈమెకు టెలివిజన్ గుర్తును కేటాయించారు. తొలి ఎఫ్ఎం ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా ఇప్పటికే పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నది. ఇంటర్ వరకు చదువుకున్న అనన్య పేరు వెల్లడి కాగానే కేరళలోని ట్రాన్స్ జెండర్ల సమూహం హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యక్ష ఎన్నికలలో అనుమతించడం లేదు. కున్హాలీ భావజాలం కూడా ఇదేనని అనన్య చెబుతోంది. ఎన్నికల్లో గెలిచి స్త్రీలు, ట్రాన్స్ జెండర్లు మంచి పాలన అందిస్తారని నిరూపించదల్చుకున్నానని ఆమె చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.