FbTelugu

పేద దేశానికి తొలి సీరం వ్యాక్సిన్ సరఫరా

ముంబయి: భారత్ కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విదేశాలకు కోవిషీల్డు వ్యాక్సిన్ ను విదేశాలకు సరఫరా చేస్తున్నది. ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) సూచనల మేరకు పంపిస్తున్నది.

కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఘనా దేశానికి కోవిషీల్డు వ్యాక్సిన్లను పంపించినట్లు సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అధర్ పూనవల్లా తెలిపారు. ఘనాకు ఆరు లక్షల డోసులను ఎగుమతి చేశామన్నారు. త్వరలోనే మరో ముప్పై పేద దేశాలకు తమ వ్యాక్సిన్లను పంపిస్తామన్నారు. యూనిసెఫ్ ఆర్డర్ చేసిన ఈ వ్యాక్సిన్లు ఘనాలోని ఆక్రా విమానాశ్రయానికి బుధవారం చేరుకున్నాయన్నారు. కోవాక్స్ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘనా కూడా ఉందని ఆయన వెల్లడించారు. ఘనా దేశం జనాభా 3 కోట్లు కాగా ఇప్పటి వరకు 81వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 600 మరణాలు మాత్రమే సంభవించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.