FbTelugu

బాలు కోసం శబరిమలలో పూజలు

తిరువనంతపురం: కరోనా పాజిటివ్ తో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలంటూ శబరిమల ఆలయం కళాకారులు సంగీత ప్రార్థనలు చేశారు.

కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం కోసం పలువురు ప్రార్థిస్తున్నారు. శబరిమల అయ్యప్ప దేవస్థానం బోర్డుకు చెందిన కళాకారులు ఇవాళ సంగీత ప్రార్థనలు నిర్వహించారని దేవస్థానం పీఆర్ఓ సుపిల్ అరుమనూర్ తెలిపారు.

You might also like