FbTelugu

బెంగాల్‌లో ఫోన్‌కాల్స్‌ లొల్లి!

వెస్ట్‌బెంగాల్‌ ఎన్నికలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఎనిమిది విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడత పూర్తయింది. మిగతా ఏడు విడతల ఎన్నికలకు ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారు ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫోన్‌కాల్స్‌ రగడ తెరమీదకు వచ్చింది. ఇది ఇప్పుడు బెంగాల్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మనకు పశ్చిమబెంగాల్‌లోని చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు లేరని, ఇలా అయితే, కష్టమే. ఎన్నికల్లో గెలవలేదు. అందుకకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు కూడా పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా అవకాశమివ్వాలి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా విజ్ఞప్తి చేయాలి అని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీకి చెందిన శిశిర్‌ బజోరియా ఆ పార్టీకి చెందిన ముఖుల్‌రాయ్‌తో చేసిన సంభాషణ ఆడియో టేప్‌ను టీఎంసీ బయట పెట్టింది.

ఇప్పుడీ ఈ వీడియో రాజకీయ దుమారాన్ని లేపుతోంది. బీజేపీ నేతలు ఇలా దొడ్డిదారిన తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే వారి కోరిక మేరకే బెంగాల్‌ ఓటర్లు రాష్ట్రంలోని ఏ పోలింగ్‌ బూత్‌లోనైనా ఏజెంట్లుగా ఉండవచ్చంటూ గతవారం ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చిందని, ఇదంతా అమిత్‌షా నేతృత్వంలోనే జరిగిందని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జి విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో మమత మాట్లాడిన ఆడియో టేపులు కూడా ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. ఈ ఆడియో టేపుల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గంలో తనకు సాయం చేయండి అంటూ బీజేపీ నేతలకు ఫోన్‌చేసిన మాట్లాడినట్టుగా ఉంది. దీంతో నందిగ్రామ్‌లో బీజేపీ చేతిలో మమత ఓడిపోతుందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఫోన్‌చేసి తనకు మద్దతుగా నిలవాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారని కమలనాథులు విమర్శలకు దిగుతున్నారు. మొత్తానికి బెంగాల్‌ ఎన్నికల్లో ఆడియో టేపుల లొల్లి నానాటికి ముదిరి పాకాన పడుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.