FbTelugu

మత్తు మందు ఇచ్చి మూట కట్టేశారు…

వరంగల్: నగర శివారు గొర్రకుంట బావిలో బయటపడ్డ తొమ్మిది మంది మృతి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఎంజీఎం హాస్పిటల్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజామాలిక్ ఈ ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టారు. కుటుంబ యజమాని మక్సూద్ తో పాటు మొత్తం 8 మందిని చంపిన విషయం తెలిసిందే. దీనిపై ఇద్దరు అనుమానితులను వరంగల్ పోలీసులు  ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మరో తొమ్మిది బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.

మక్సూద్ ఇంట్లోనే అందరికీ మత్తు మందు ఇచ్చి సృహకోల్పోయాక పని కానిచ్చేశారని డాక్టర్ రజా మాలిక్ వెల్లడించారు. చనిపోయిన తరువాత వారిని గోనెసంచుల్లో పెట్టి బావి వరకు తీసుకువచ్చి పడేశారని అన్నారు. సంచుల్లో వేసి బావిలో పడేయడం వల్ల అందరి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి చనిపోయారన్నారు. ఘటనా స్థలంలో మత్తు ట్యాబ్లెట్లు, కూల్‌డ్రింక్స్ పోలీసులకు లభ్యమయ్యాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈకేసులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు స్పష్టమౌతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

You might also like