FbTelugu

తొలి డోసు ఒకటి… మలి డోసు మరో కంపెనీ

లక్నో: వ్యాక్సినేషన్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఒక నర్సు వ్యాక్సిన్ ఇవ్వగా, మరొక నర్సు ఒకేసారి రెండు డోసులు ఇచ్చేసింది. మరొక నర్సు అయితే సిరంజిలో వ్యాక్సిన్ లేకుండానే రోగికి ఇచ్చేసింది.

ఇదే కాకుండా ముగ్గురు మహిళలకు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి కలకలం సృష్టించారు. ఈ ఘటనలు మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో వైద్య సిబ్బంది మరో నిర్వాకానికి పాల్పడ్డారు. అత్యంత జాగ్రత్తగా పనిచేయాల్సిన నర్సులే అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు. మహారాజ్ గంజ్ జిల్లా చీప్ డెవలప్ మెంట్ అధికారికి ఉమేష్, మదన్, చందన్ లు డ్రైవర్లు గా పనిచేస్తున్నారు. ముగ్గురు మార్చి నెలలో తొలిసారి కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండు రోజుల క్రితం మళ్లీ రెండో డోసు వేసుకునేందుకు ఆసుపత్రి వెళ్లగా ఉమేష్ కు వ్యాక్సిన్ ఇచ్చారు. కొవాగ్జిన్ ఇస్తే పర్వాలేదు కాని కోవిషీల్డ్ ఇచ్చి పొరపాటు జరిగిందని గ్రహించారు. వెంటనే మిగతా ఇద్దరికి ఇవ్వకుండా మిన్నకుండిపోయారు.
దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకుండా అలా జరగాల్సి ఉండాల్సి కాదని వ్యాఖ్యానించడం శోచనీయం. అయితే రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్న ఉమేష్ శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.