FbTelugu

మూడోసారి రష్యా తీపి కబురు

మాస్కో: ప్రపంచంలోనే తొలిసారి ఆగస్టు 4వ తేదీన కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తున్నామని రష్యా తొలుత ప్రకటించింది. ఆ తరువాత ఆగస్టు 8న వ్యాక్సిన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది.

తాజాగా రష్యా దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ తీపి కబురు చెప్పారు. ఉఫా నగరంలో జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ… ఈ నెల 12వ తేదీన మార్కెట్ లోకి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. గమలేనియా సెంటర్ లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశ దాదాపు చివరి దశలో ఉందని ఆయన తెలిపారు.

తొలుత ఈ వ్యాక్సిన్ వైద్యులు, మెడికల్ సిబ్బంది, వృద్ధులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఆ తరువాత మిగతా వారికి ఇస్తారని మంత్రి ఓలెగ్ తెలిపారు. రష్యా రక్షణ శాఖ, గమలేయా రీసెర్చి సెంటర్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి. ముందుగానే వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.

You might also like