FbTelugu

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు!

ప్యాంగ్యాంగ్: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని దేశాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాంటి దేశాల్లో ఉత్తర కొరియా ఒకటిగా ఉంది.

అయితే తాజాగా ఉత్తర కొరియాలోనూ తొలి కరోనా అనుమానిత కేసు నమోదైంది. దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలోని కేసాంగ్‌ నగరంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం కేసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించింది.

You might also like