FbTelugu

ఇదేం కేసు… 3 ఫంగస్ లతో మృతి

లక్నో: ఫస్ట్ వేవ్ లో కరోనా వైరస్ వణికించగా, సెకండ్ వేవ్ లో మాత్రం మ్యూటెంట్లు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వీటికి ఫంగస్ లు తోడుకావడంతో బతుకు మీద ఆశ అనేది మృగ్యంగా మారింది.

వైరస్ కు తోడు ఫంగస్ లు రావడంతో జనం వణికిపోతున్నారు. కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని కోలుకున్న కొందరిలో ఫంగస్ లక్షణాలు బయటపడుతున్నాయి. డయాబెటిక్, బిపి, గుండె శస్త్ర చికిత్స, కిడ్నీ సమస్యలు ఉన్నవారిని ఫంగస్ లు చుట్టుముడుతున్నాయి. మొదట బ్లాక్ ఫంగస్ అన్నారు, వారం రోజులుగా వైట్ ఫంగస్ అంటున్నారు, ఇప్పుడేమో ఎల్లో ఫంగస్ వ్యాపిస్తున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫంగస్ లు సోకిన వ్యక్తికి ఖరీదైన వైద్యం చేయాల్సి రావడంతో ముఖ్యంగా పేదలు భయంతో చస్తున్నారు. పలు రాష్ట్రాలు ఫంగస్ కేసుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మూడు రకాల ఫంగస్ సోకిన వ్యక్తిన మరణించాడు.

ఘజియాబాద్ జిల్లా సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన కున్వర్ సింగ్ (45) కరోనా బారిన పడడంతో హాస్పిటల్ లో చేర్చారు. రెండు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్య పరిస్థితి దిగజారడం, ముఖంలో ఒక వైపు నుంచి వాపు రావడంతో పాటు కళ్లు తెరుచుకోవడం లేదు. ఈ నెల 24వ తేదీన ఎండోస్కోపి నిర్వహించగా బ్లాక్ ఫంగస్ తో పాటు వైట్, ఎల్లో ఫంగస్ లు సోకాయని వైద్యులు గుర్తించారు. నాలుగు రోజులుగా ముక్కు, మూత్ర ద్వారం నుంచి రక్తం కారుతోంది. చికిత్స ప్రారంభించినప్పటికీ శరీరం మొత్తం విషపూరితం కావడంతో కున్వర్ సింగ్ ఇవాళ మృతి చెందాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.