FbTelugu

కరోనా సెంటర్ లో అగ్ని ప్రమాదం

భోపాల్: వేసవికాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది విజయవాడలో కరోనా క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించిన విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉజ్జయిన్ లో చోటు చేసుకున్నది.
ఉజ్జయిన్ లోని ప్రీగంజ్ ఏరియాలోని పాటిదార్ ఆసుపత్రిలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 80 మంది రోగులు ఉండగా ఇందులో 62 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. మంటలు చెలరేగగానే కొందరు రోగులు బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మొదటి, రెండో అంతస్తులో మంటలు వ్యాపించాయి. వేగంగా మంటలు వ్యాపించినప్పటికీ 80 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉజ్జయిన్ జిల్లా ఎస్పీ అమరేంద్ర సింగ్ తెలిపారు.

బాధితులందరినీ సమీపంలో గురునానక్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కొంత మందికి స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. మంటలు అంటుకోగానే కొందరు కరోనా రోగులు కిటికీలు, ఇతర మార్గాల ద్వారా బయటకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

You might also like

Leave A Reply

Your email address will not be published.