FbTelugu

చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: లక్డీకపూల్ కృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ లో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది.

ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు వెంటనే అప్రమత్తమై చికిత్స పొందుతున్న చిన్నారులను సమీపంలోని లోటస్ హాస్పిటల్ కు తరలించారు. ముందుగానే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరకీ ఎటువంటి అపాయం కలుగలేదని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.

You might also like