FbTelugu

కశ్మీర్ లో బీజేపీ నాయకుని వాహనానికి నిప్పు

Fire-in-BJP-leaders-vehicle-in-Kashmir

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. తెల్లవారు జామున రెండు వాహనాలకు నిప్పు పెట్టిన ఘటన కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందులో ఒక వాహనం స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుడిది అని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన బీజేపీ నాయకుడు అదిల్‌ అహ్మద్‌ నివాసం బయట చోటుచేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like