FbTelugu

అగ్నిప్రమాదంలో 1200 గుడిసెలు ఆహుతి

ఢిల్లీ: దక్షిణ తూర్పు ఢిల్లీలోని తుగ్లకాబాద్ లో సోమవారం అర్థరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 1200 గుడెసెలు దగ్ధమయ్యాయి. మంటలు అంటుకోగానే ప్రజలు బయటకు పరుగులు తీశారు.

ఇళ్లు కాలిపోతున్నాయంటూ ప్రజలు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి  ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 30 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా తెలిపారు.

You might also like