FbTelugu

కరోనా కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

గాంధీనగర్‌: దేశంలో తరచూ కరోనా కేర్ సెంటర్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదు.

భరూచ్‌ లోని పటేల్ వెల్ఫేర్ కోవిడ్‌ కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు చనిపోయారు. ఈ కేంద్రంలో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను రక్షించారు. అర్ధరాత్రి తర్వాత భారీ మంటలు చెలరేగినట్లు భరుచ్ జిల్లా ఎస్పి రాజేంద్ర సింహ్ తెలిపారు. ఆసుపత్రిలో మంటలు చెలరేగగానే అంటుకుని 12 మంది చనిపోగా, చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారని ఆయన పేర్కొన్నారు. భరుచ్-జంబుసర్ రోడ్డు పక్కన నాలుగు అంతస్థుల భవనంలో కోవిడ్ కేంద్రం నడుపుతున్నారన్నారు. గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చామని, స్థానికులు, సిబ్బంది కలిసి 50 మందిని రక్షించారని ఆయన వెల్లడించారు. అయితే ప్రమాదానికి ఏంటనేది కచ్చితమైన కారణం తెలియదని రాజేంద్ర తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.