FbTelugu

జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం

* రోగులను మరో చోటుకి తరలింపు

గుంటూరు: నిన్న రాత్రి జిల్లాలోని జీజీహెచ్ (ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. నిన్న రాత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఐసీయూ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను గమనించి అప్రమత్తమైన సిబ్బంది ఐసీయూలోని రోగులను వెంటనే మరో చోటుకి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.