FbTelugu

గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో యూరాలజీ ల్యాబ్‌లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపు ఆసుపత్రి సిబ్బంది మూడో అంతస్తులోని ల్యాబ్ లో మంటలను కొంత మేర అదుపులోకి తీసుకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు రావడంతో యూరాలాజీ ల్యాబ్ లోని అత్యంత విలువైన పరికరాలు, వస్తువులు బూడిదగా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.