FbTelugu

కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

విజయవాడ: కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదఘటనలో ఇప్పటి వరకు  తొమ్మిది మంది కరోనా రోగులు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 30 మంది రోగులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‍ను రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కోవిడ్ సెంటర్‍గా మార్పు చేసింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చింది. ఐదుగురు కరోనా పేషెంట్లు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

హోం మంత్రి దిగ్భ్రాంతి…

విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 40 మంది కరోనా భాదితులు, 10 మాంది వైద్య సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరం అని ఆమె పేర్కొన్నారు.

You might also like