FbTelugu

కరోనా రోగుల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ముంబై: డ్రీమ్ మాల్ లోని కరోనా సన్ రైజ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సజీవ దహనం కాగా మరో 70 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.
మాల్ లోని మూడో అంతస్తులో గురువారం అర్థరాత్రి తరువాత అకస్మాత్తుగా మంటలు రాగా అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు 23 ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలార్పారు. ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని డిసిపి ప్రశాంత్ కదం తెలిపారు. ఇద్దరు చనిపోగా 73 మందిని వేరే ఆసుపత్రికి తరలించామన్నారు. ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

గురువారం నాడు ముంబై లో 5,504 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ ప్రారంభం అయిన తరువాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.