FbTelugu

టాబ్లెట్స్ లారీలో మంటలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడ వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై ఒ కంటేనర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు.

స్థానిక పొలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటనా స్థలానికి చెరుకున్న శంషాబాద్ పొలిసులు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలను అదుపుచేశారు. బెంగుళూరు నుండి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్ లేట్ లోడుతో వస్తున్న కంటేనర్ శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

You might also like