FbTelugu

కోళ్లు గుడ్లు పెట్టడం లేదని ఎఫ్ఐఆర్

ముంబై: తన కోళ్ల ఫారంలోని బ్రాయిలర్ కోళ్లు గుడ్లు పెట్టడం లేదంటూ ఒక యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒక కంపెనీ దాణాను తన కోళ్లు తినడం మూలంగా గుడ్లు పెట్టడం లేదని పూణే జిల్లాకు చెందిన ఒక రతు ఆరోపించాడు. అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన ఒక కంపెనీ నుంచి దాణాను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆ దాణా తిన్న తరువాతే పెట్టడం లేదని, అంతకు ముందు పెట్టాయని రైతు వాపోయాడు. ఈయనతో పాటు మరో నలుగురు రైతులు కూడా ఇదే సమస్యపై పోలీసులను కలిశారు.

దీనిపై పోలీసులు సంబంధిత జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిని సంప్రదించారు. దాణా పడకపోవడం మూలంగానే కోళ్లు గుడ్లు పెట్టడం లేదని, ఇది సాధారణమేనని అన్నారు. వేరే దాణా పెడితే మళ్లీ గుడ్లు పెడతాయని అధికారి చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.