FbTelugu

వైసీపీలో చేరితే ఫైన్ లు రద్దు చేస్తున్నారు: చంద్రబాబు

అమరావతి: వైసీపీలో చేరితే వ్యాపారాలపై వేసిన ఫైన్ లను రద్దు చేస్తున్నారని, లేకుంటే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇవాళ ఆయన తమ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు..

నేరస్తుడు పాలకుడు అయితే నిరపరాదులు జైళ్లలో ఉంటారన్న మాట ఏపీలో నిజమౌతోందని అన్నారు. ప్రభుత్వం తీసుకునేవి తప్పుడు నిర్ణయాలు కాబట్టే కోర్టులు తప్పుబడుతున్నాయని, కోర్టు తీర్పులతో తీవ్ర అసంతృప్తితో జగన్ ఉన్నారని అన్నారు. ప్రజాదరణ ఉన్న టీడీపీ రాజకీయ కుటుంబాలపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని అన్నారు.

You might also like