FbTelugu

ముత్తూట్, మణఫ్పురం ఫైనాన్స్ లపై ఫైన్

ముంబై: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో రెండు ఫైనాన్స్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపించింది. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ పై జరిమానా విధించింది.

బంగారు ఆభరణాలపై రుణాలకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియోను నిర్వహించకపోవడం, పాన్ కార్డు పొందే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. దీంతో ముత్తూట్ ఫైనాన్స్ కు రూ.10 లక్షలు జరిమానా విధించారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. మణప్పురం కూడా ఇవే తప్పిదాలు చేయడంతో రూ.5 లక్షలు జరిమానా వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.