FbTelugu

మాస్క్ లేకుండా స్టేషన్ లో కన్పిస్తే రూ.500 జరిమానా

న్యూఢిల్లీ: ప్రయాణీకుల క్షేమం దృష్ట్యా రైల్వే శాఖ కరోనా వైరస్ విషయంలో చర్యలు చేపట్టింది. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలు, సరకుల రవాణా కార్యాలయాల్లో మాస్క్ ధరించకుండా సంచరిస్తే రూ.500 జరిమానా విధిస్తారు.

రైల్వే పరిసరాలు, రైళ్లలో మాస్క్‌ ధరించకపోతే నేరంగా పరిగణించి, రూ. 500 వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకంటించింది. ఈ మేరకు రైల్వే శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం అత్యవసరం అని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతేడాది మే 11న భారత రైల్వే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ మాస్క్‌ లు విధిగా ధరించాలని పెల్లడించింది. మాస్క్ ల విషయంలో తాజాగా చట్టం మార్పులతో మాస్క్‌ లు ధరించని వారికి కూడా జరిమానా వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో మాస్క్‌ లు ధరించకుండా ఎవరైనా కన్పిస్తే రూ.500 వరకు జరిమానా వేస్తారు. ఈ ఆదేశాలు ఆరు నెలల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఇవి అమలులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.