FbTelugu

మాస్కు ధరించకుంటే రూ.250 ఫైన్‌

ఒక్క రోజులో రూ.17 లక్షలు వసూలు

అమరావతి : మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే వారిపై పోలీసులు ముక్కుపిండి జరిమానాలు విధిస్తున్నారు. ఆదివారం నాడు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి రూ.17 లక్షలు వసూలు చేశారు.

కరోనా విస్తరణ, నియంత్రణ చర్యలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆదివారం నాడు జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాస్క్‌ లు లేకుండా బయటకు ఎవరొచ్చినా జరిమానా విధించకుండా వదిలి పెట్టొద్దని ఆదేశించారు. ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చెంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కచ్చితంగా మాస్క్‌ వినియోగించేలా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. డీజీపీ ఆదేశం మేరకు పోలీసులు మాస్క్ లేనివారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత కొద్దిసేపు కౌన్సెలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.