FbTelugu

టూ లెట్ స్టిక్కర్ కు రూ.2వేలు జరిమానా

హైదరాబాద్: నగరంలో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు టూ లెట్ అని, తమ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, యాడ్ నోటీసులు విపరీతంగా కన్పిస్తాయి. తాజాగా టూ లెట్ అని నోటీసు అంచిన ఒక వ్యక్తికి జిహెచ్ఎంసి సిబ్బంది రూ.2వేల జరిమానా విధించింది.
టూ లెట్ అని వివరాలు అంటించిన వ్యక్తికి ఇల్లు కావాలని ఎవరైనా ఫోన్ చేశారో లేదో తెలియదు కాని జిహెచ్ఎంసి సిబ్బంది మాత్రం ఆయనకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ చూసిన సదరు యజమాని ఇంటికోసం ఆరా తీశారని పొరపడ్డాడు. ఆయన ఆనందం ఆవిరి అయ్యేలా ఈ చలాన్ జారీ చేస్తున్నట్లు చెప్పడంతో ఖిన్నుడయ్యాడు. ఇలాంటివి అంటించడం మూలంగా అందవికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జిహెచ్ఎంసి ఈ చర్య తీసుకున్నది.

అసలు వాస్తవం ఏమంటే జరిమానా పొందిన వ్యక్తి అడ్రస్ కూడా హైదరాబాద్ కాదు. అతను సిద్దిపేటలోని వర్గల్ మండలం పాములపర్తి గ్రామంలో నివాసం ఉంటాడు. దాని పక్కనే ఉన్న యాక్ట్ ఫైబర్ నెట్ స్టిక్కర్ పై ఏం చర్యలు తీసుకున్నారంటూ సొసైటీ జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందిని ప్రశ్నించింది. ఆ సంస్థపై కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రశ్నించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.