FbTelugu

రివర్స్… మాస్కు ధరిస్తే జరిమానా!

వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో మాస్క్ ధరించాలని కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా అందుకు పూర్తి భిన్నంగా అమెరికా వ్యవహరిస్తున్నది. మాస్క్ ధరించకపోతే ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తుండగా, అమెరికాలో మాత్రం మాస్క్ ధరిస్తే జరిమానా వేస్తున్నారు.
కేసులు పూర్తిగా తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావడంతో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రకటించారు. మాస్కులు లేకుండా తిరగవచ్చని, జన సమూహం ఉన్న ప్రాంతాల్లోనే ధరించాలని గత నెలలో అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కూడా చెప్పారు.

తాజాగా కాలిఫోర్నియాలో ఫిడిల్ హెడ్ కేఫ్ రెస్టారెంట్ ఊహించని నిబంధన అమలు చేస్తున్నది. రెస్టారెంట్ లోకి ఎవరైనా మాస్కుతో వస్తే బిల్లుతో పాటు అదనంగా 5 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని నోటీసు బోర్డు పెట్టింది. కొందరు భయపడి వాటిని ధరించే రెస్టారెంట్లలోకి వస్తున్నారు. ఇలా వసూలైన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ యజమాని క్రిస్ కాజిల్ మాన్ వెల్లడించారు. ఇలా వసూలు చేయడం తప్పు కాదని ఆయన సమర్థించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.