FbTelugu

దేశాధ్యక్షుడికి వంద డాలర్ల ఫైన్

మన దేశంలో అయితే కనీసం ఎమ్మెల్యేకు ఫైన్ వేసే సాహసం చేయరు. కాని యురోపియన్ దేశాల్లో మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తే అధ్యక్షుడు అయినా సరే అపరాధ రుసుం విధిస్తారు.

బ్రెజిల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి అధికారంలోక వచ్చేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సొనారో విస్తృతంగా పర్యటనలు మొదలుపెట్టారు. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా దేశ వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు ఆయన సావో పాలో లో బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ ర్యాలకీ వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన బొల్సోనారో హెల్మెట్ ధరించకుండా, ఫేస్ మాస్క్ పెట్టుకోకుండా బైక్ నడిపారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికారులు వంద డాలర్ల ఫైన్ విధించారు. కరోనా మహమ్మారి మొదలు ఆయన లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవద్దని, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, శానిటైజర్ వినియోగించవద్దని ప్రజలకు చెబుతున్నారు. అమెరికా దేశం తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ మరణాలు సంభవించిన దేశంగా బ్రెజిల్ గుర్తింపు పొందింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.