FbTelugu

కడపల్లి కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం

ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు..

అమరావతి: చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లి దగ్గర ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న దుర్ఘటన చనిపోయిన వారికి జనసేన పార్టీ భారీ సాయం అందచేసింది. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కల్యాణ్  ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు.

ఆ దుర్ఘటనలో కడపల్లి వాసులు రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం మృతి చెందారు.  వీరి కుటుంబాలను పార్టీ నేతలు పరామర్శించి చెక్కులు అందచేశారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన సాయంతో పాటు మెగా హీరోలు రాంచరణ్, నిర్మాతలు అల్లు అర్జున్, దిల్ రాజు, ఎ.ఎం.రత్నం, మైత్రీ మూవీస్ నవీన్, రవి, జనసేన ఎన్.ఆర్.ఐ విభాగం వారు ఉన్నారు.  మృతులు రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 13.25 లక్షలు ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన నలుగురికీ ఒక్కొక్కరికీ రూ. 1.25 లక్షల మొత్తాన్ని చెక్కుల రూపంలో ఇచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు.

You might also like