FbTelugu

రెండు కాదు… ఒక్క డోసు వేశారు: అరవింద్

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ కొట్టిపారేశారు.

కరోనా వచ్చింది వాస్తవమేనని, రెండు డోసుల తరువాత మాత్రం కాదని ఆయన ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారు. నేను ఇటీవలే ఫస్ట్ డోస్ తీసుకున్నాను. తరువాత మగ్గురం స్నేహితులం కలిసి మా ఊరు వెళ్లి వచ్చాం. ఆ తరువాత మాకు కరోనా వచ్చిందని తెలుసుకున్నాం. నేను, మరో స్నేహితుడు మూడు రోజుల పాటు జ్వరంతో ఇబ్బంది పడ్డామన్నారు. మేమిద్దరం వ్యాక్సిన్ వేయించుకోగా మరో స్నేహితుడు వేయించుకోలేదు. ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న తరువాత కరోనా వచ్చినా అంత తీవ్రత ఉండదన్నారు. అందుకు నేనే నిదర్శనం అని చెప్పారు. ఫస్ట్ డోస్ తీసుకున్న తరువాత కరోనా రావచ్చు, రాకపోవచ్చు అన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రాణాలు కాపాడుకోవాలని అల్లు అరవింద్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.