భోపాల్: చాలా కేసుల్లో అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తితో లైంగికానందం పొందుతూ సహజీవనం చేస్తున్నారని, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మాత్రం అత్యాచారం కేసులు పెడుతున్నారని ఛత్తీస్ గఢ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కిరణ్మయి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.
సహజీవనం చేసిన తరువాత ఇరువురి మధ్య బంధం బెడిసికొట్టిన తరువాతమే మహిళలు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యనించారు. యువత సినిమాలు చూసి మోసపోవద్దని, ఒక తప్పుడు నిర్ణయం కారణంగా జీవితం నాశనమై పోతుందని ఆమె హెచ్చరించారు. మీరు సహజీవనం చేసి పడుకుంటే కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై బిలాస్ పూర్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కిరణ్మయి నాయక్ ప్రసంగించారు. పెళ్లైన వ్యక్తి యువతిని వివాహేతర బంధంలోకి ఆహ్వానిస్తున్నాడంటే జాగ్రత్తపడాలన్నారు. అతడు నిజమే చెబుతున్నాడా, అబద్దం అడుతున్నాడా అనే విచారణ చేసుకోవాలన్నారు. అతడితో జీవితం పంచుకోవడం సరైందో కాదో గ్రహించాలని ఆమె హితవు పలికారు.