FbTelugu

రెండు కోట్లతో కేసు వేసి.. విరమణ ఏంటీ ?: భాను ప్రకాశ్ రెడ్డి

తిరుపతి : రూ.2 కోట్లు కట్టి టీటీడీ హైకోర్టులో పరువునష్టం కేసువేసి ఇప్పుడు విరమించుకోవడం ఏంటని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఎవరి కోసం, ఎందుకోసం పరువు నష్టం దావా వేశారు.

ఇప్పుడు ఎందుకు విత్‌ డ్రా చేసుకుంటారన్నారని ప్రశ్నించారు. టీటీడీ నిర్ణయం రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలకు అనుకూలంగా ఉందన్నారు. కోర్టులో కేసు వేసేందుకు కట్టిన ఆ రూ.2 కోట్లను వడ్డీతో సహా కట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి పాలకులు, పాలకమండలి, ఇప్పటి పాలకులు, పాలకమండలి, రమణదీక్షితులు ఆ రెండు కోట్ల రూపాయలను వడ్డీతో సహా కట్టాలని డిమాండ్ చేశారు. రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలపై పెట్టిన కేసులను విత్‌ డ్రా చేసుకుంటూ వేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 2కి వాయిదా పడింది. ఈ మేరకు 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టు పేర్కొన్నారు. టీటీడీ పరువు నష్టం కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌పై నవంబర్ 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హిందూ జనశక్తిని జడ్జి ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.