FbTelugu

సిఎం పర్యటనలో తన్నుకున్న ఐపిఎస్ లు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో సిఎం జైరాం ఠాకూర్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ముగ్గురు అధికారులపై బలవంతపు సెలవుపై పంపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భుంటార్ విమానాశ్రయం బయట కిసాన్ సంఘ్ సభ్యులు గుమికూడారు.

ప్రజలు గుమికూడి ఉండడాన్ని సిఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కులు ఎస్పి గౌరవ్ సింగ్, సిఎం భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్పి గౌరవ్ సింగ్ జిల్లా అదనపు ఎస్.పి బ్రిజేష్ సూద్ ను చెంప దెబ్బ కొట్టాడు. అక్కడే ఉన్న సిఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ బల్వంత్ సింగ్ గౌరవ్ సింగ్ ను కాలితో గట్టిగా తన్నాడు. ఈ ఘటనపై అక్కడున్నవారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు బలవంతపు సెలవుపై పంపించారు. కులు ఎస్.పి, అదనపు ఎస్.పి ని బదిలీ చేసి వారి స్థానంలో ఇద్దరు అధికారులను నియమించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.