హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని ఇలాంటి టైంలోనే ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
అనవసరంగా బయటకు వచ్చి కరోనాను అంటించుకోవద్దని సూచించారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విశేషమైన కృషిచేస్తోందని అన్నారు. దీనికి ప్రజలు సహకారం చాలా అవసరం అని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు.