FbTelugu

ప్రతి గ్రామానికి ఆగస్టు కల్లా ఫైబర్ నెట్

హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ నెల నుంచి ముప్పై వేల ప్రభుత్వ కార్యాలయాలకు టి ఫైబర్ కనెక్షన్ అందుబాటులోకి వస్తుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అదే విధంగా ఆగస్టు నాటికి ప్రతి గ్రామపంచాయతీకి ఇంటర్ నెట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు.
ఇవాళ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో ఐటి, ఆర్థిక, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. రైతు వేదికలను టి ఫైబర్ తో అనుసంధానం చేస్తామని, ఇప్పటికే ఐదు రైతు వేదికలకు ప్రయోగాత్మకంగా కనెక్షన్ ఇచ్చామన్నారు. మిషన్ భగీరథ పనుల పూర్తి కావడంతో గ్రామాల్లో టి ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయన్నారు.

టి ఫైబర్ పరిధిని పట్టణ ప్రాంతాలకు విస్తారిస్తామన్నారు. జిహెచ్ఎంసి అధికారులు నగరంలో సర్వే చేసి నివేదిక అందచేస్తే అనుమతిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ చేరుకోవాలనేదే తమ లక్ష్యమని కెటిఆర్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.