హైదరాబాద్: డ్రగ్స్ పేరుతో మొన్నటి వరకు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను వణించిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి కర్ణాటక డ్రగ్ కేసు తలనొప్పిగా మారింది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు త్వరలోనే నోటీసులు ఇస్తామని కర్ణాటక పోలీసులు ప్రకటించడంతో గుబులు మొదలయ్యింది.
ఈ కేసులో వీరితో పాటు ఇద్దరు రియల్టర్లు, 8 మంది ఈవెంట్ మేనేజర్లు, టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. బెంగళూరులో పబ్బులు, క్లబ్బుల వ్యాపారం నిర్వహిస్తున్న సందీప్ రెడ్డి ని ఇప్పటికే బెంగళూరు పోలీసులు విచారించారు. ఈవెంట్ మేనేజర్ కలహర్ రెడ్డి, ఉద్యమకారుడు రతన్ రెడ్డికి రెండు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసు విచారణలో సందీప్ రెడ్డి హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో డ్రగ్స్ దందాపై పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం.
సిని నిర్మాత శంకర్ గౌడ 2016లో ఇచ్చిన విందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఇచ్చిన ఈ పార్టీలో ఇరానీ దేశానికి చెందిన కాల్ గర్ల్స్ తో డ్యాన్సులు చేసి మజా చేశారు. ఈ విందులో కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి, హీరో తనీశ్, రాజశేఖర్, వికీ మల్హోత్రా, మస్తాన్ చాంద్, డేనియల్ పాల్గొన్నారు.