FbTelugu

మీ భూములకు కంచె వేసుకోండి: అయ్యన్న

విశాఖపట్నం: విశాఖకు రాజధాని మార్పు కేవలం, విశాఖ లో విలువైన భూముల దోచుకోవడం కోసమే… అనీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, రాజధానుల అంశం కోర్టు లో నిలబడదు అన్నారు. ఒకవేళ రాజధాని విశాఖపట్నం కు మారితే, విశాఖ ప్రజల మంచి కోరి చెప్తున్నా, మీరు మీ భూములకు కంచె లేదా, ప్రహరీ గోడ కట్టుకోండని ఆయన పిలుపునిచ్చారు. విశాఖలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని రంగాలు అభివృద్ధి అయ్యాయని గర్వంగా చెప్పగలను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటిపడిందని చెప్పారు. విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది చంద్రబాబు అని అయ్యన్న పాత్రుడు అన్నారు.

ఇంటికి మూడు మాస్క్ ఇస్తానని ఇవ్వని నువ్వు, 3 రాజధానులు నిర్మాణం చేస్తావా…? అని ప్రశ్నించారు. ఉద్యోగస్తులకు జీతాలు సరిగా ఇవ్వని నువ్వు, మూడు రాజధానులు ఎలా చేస్తావ్…? నిలదీశారు. పెన్షన్ దారులకు పెన్షన్ 3000 ఇవ్వని నువ్వు, మూడు రాజధానులు ఎలా కడతావ్…? చెప్పాలి అని మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

You might also like