FbTelugu

మహిళా యూ ట్యూబర్ కు బెదిరింపులు… ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: పాతబస్తీలో ఒక మహిళా యూ ట్యూబ్ వేదిక గా వీడియోలు పెడుతున్నది. ఈ వీడియోలను చూసిన ఒక చాందసవాది, కార్యకర్త సయ్యద్ సలీం ఆమెపై అనుచిత కామెంట్లు పెట్టాడు. మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సయ్యద్ సలీం పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫేస్ బుక్ ఖిద్మత్ ఈ ఖల్క్ ఛారిటబుల్ ట్రస్టును సలీం నడుపుతున్నాడు. సలీం తన ఫేస్ బుక్ లైవ్ ద్వారా మహిళా యూ ట్యూబర్ పై అవమానకర, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో చూసిన ఆమె అవమానంతో నిద్ర మాత్రలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిపై ఐపిసి 354, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నామని సిఐ రుద్ర భాస్కర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.