FbTelugu

ప్రేమ జంటను కత్తులతో పొడిచిన తండ్రి

బెంగళూరు: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి వారిద్దరిని ఊరు ఆవలకు తీసుకువెళ్లి చెట్లకు కట్టేశాడు. ఇద్దరిని తీవ్రంగా కొట్టి, హింసించి, కత్తులతో పొడిచి, బండరాళ్లతో తలపై కొట్టి చంపేశాడు.
తండ్రికి సహాయంగా కుమారులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. యువకుడి తల్లి తన కుమారుడి చంపవద్దని కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా దారుణంగా చంపేశారు. ఆమె చూస్తుండగానే కుమారుడు, ప్రేమికురాలు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన విజయపుర జిల్లాల్లో జరిగింది. ఈ దారుణ ఘటనపై యువకుడి తల్లి మీడియాకు వివరించింది. దేవరహిప్పరగి తాలూకా సలాదహళ్లికి చెందిన బసవరాజ బడిగేర (19) ముస్లిం యువతి దావలబి బందగీసాబ్ తంబద్ (18)ను గాఢంగా ప్రేమించాడు. వేర్వేరు మతాలు కావడంతో వీరి ప్రేమను యువతి కుటుంబం వ్యతిరేకించింది.

ఆగ్రహం ఆపుకోలేని కుటుంబ సభ్యులు మంగళవారం వీరిద్దరిని సలాదహళ్లి గ్రామ శివారుకు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసి యువకుడి తల్లి, సోదరుడు కల్యాణకుమార్ కూడా అక్కడికి వెళ్లారు.
వీరు వెళ్లేసరికి ఇద్దరిని చెట్టుకు కట్టేసిన యువతి తండ్రి, కర్రలతో కొడుతున్నాడు. ఈయనతో పాటు యువతి సోదరుడు దావల్ పటేల్, అల్లుడు లాలా సాబ్, అల్లా పటేల్ రఫీక్ చాకులతో పొడిచారు. చంపవద్దని, వదిలేయాలని వేడుకున్నా బండరాళ్లతో తలపై కొట్టారు. ఇద్దరు మృతి చెందారని తెలుసుకున్న తరువాత అక్కడి నుంచి యువతి కుటుంబ సభ్యులు పరారీ అయ్యారు. ఘటన తెలుసుకున్న తరువాత పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని ఐదుగురి కోసం గాలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.