ముంబై: భారత సాఫ్ట్ వేర్ పితామహుడు ఫకీర్ చాంద్ కోహ్లీ (97) కన్నుమూశారు. భారత ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారు.
దేశంలో వంద బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేశారు. కోహ్లీ మరణం పై సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. దేశంలో ఐటీ రంగం వేళ్లూనుకోవడానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఐటీ నిపుణులు ఆయనకు రుణపడి ఉంటారని కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఛైర్మన్ రామమూర్తి అన్నారు. కోహ్లీ 1924 పెషావర్ లోజన్మించి, అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లాహోర్ పంజాబ్ విశ్వ విద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ పొందారు.
1950 లో మసాచుసెట్స్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీజీ చేశారు. 1951 లో ఇండియా కు వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత 1968 ఏప్రిల్ 1న టీసీఎస్ స్థాపించారు. 1995 నుంచి 1996 వరకు నాస్కామ్ అధ్యక్షుడిగా పనిచేశారు.