FbTelugu

కుమార్తెను దారుణంగా చంపిన కసాయి తండ్రి

విజయవాడ: ఒక కసాయి తండ్రి.. కన్న కూతురునే కిరాతకంగా హతమార్చాడు. చదురు మహా లక్ష్మి అమ్మవారి టెంపుల్ మాకిన వారి వీధి లో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఏడు సంవత్సరాల కూతురి మొహం పై దిండుతో నొక్కి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ కొత్తపేట మకిన వారి వీధిలో జె. రాజా, యుగందరి ల కుమార్తె నివాసముంటున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి రాజా గొల్లపూడి మెడికల్ షాపులో గుమస్తాగా పని చేస్తారు. ఫిబ్రవరి నెల నుంచి ఉద్యోగానికి వెళ్లడం లేదని భార్యా అడిగిందని భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న తండ్రి కుమార్తెను హతమర్చాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.