FbTelugu

ఆస్తులిచ్చాను… అన్నం కూడా పెట్టరా?: కన్నతండ్రి

హుస్నాబాద్: కన్న కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తే కంటికి రెప్పలా చూసుకోవడం లేదంటూ ఒక తండ్రి ఏకంగా కొడుకుల ఇళ్ల ముందే దీక్షకు కూర్చున్నాడు.

సిద్దిపేట పట్టణంలో కొత్తకొండ స్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లిళ్లు అయిన సంతోష్, సుధాకర్ లకు రూ.4కోట్ల ఆస్తులు పంచి ఇచ్చాడు. కదలలేని, వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పట్టెడన్నం పెట్టాలని బతిమలాడినా కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదు. తన బాగోగులు చూసుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆగ్రహం చెందిన ఆయన కొడుకల ఇళ్ల ముందే ఆదివారం రాత్రి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. దీక్ష చేస్తున్న ఆయనను చూసిన ఇరుగుపొరుగు వారు కుమారుల వైఖరిపై మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.