FbTelugu

తండ్రి ఆత్మహత్య… ఆ వెంటనే కూతుళ్ల ఆత్మహత్య…

కడప: ప్రొద్దుటూరు వై.ఎం.ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకున్నది. బాబురెడ్డి అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

పెద్ద కూతురు శ్వేత ను భర్త నిత్యం వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాబురెడ్డి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అక్కాచెల్లెలు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. అక్కతో పాటు చెల్లెలు కూడా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం స్థానికులు తెలియచేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునినారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like