FbTelugu

పంతుళ్లు రాక… బిడ్డకు తండ్రే పెళ్లి చేశాడు!

బెంగళూరు: కరోనా సమయంలో ప్రాణభీతి ఎక్కువైపోయింది. పెళ్లిళ్లు చేసేందుకు పంతుళ్లు కూడా రాకపోవడంతో చాలా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తన కుమార్తె పెళ్లి ఆగిపోకూడదని నిర్ణయించిన పంతులు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి తంతు పూర్తి చేశాడు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ పంతుళ్ల సొంత ఇంట్లో వివాహం జరిగితే మరో పంతులు వచ్చి వివాహం జరిపిస్తారు. ఇంటి యజమాని వధువు లేదా వరుడి తరఫున కూర్చోవాలని కాబట్టి, వేరే పంతుళ్లను పిలిపిస్తారు. రాయచూర్ జిల్లా సింధనూర్ తాలుకాలో మలయ్యస్వామి తన కుమార్తెకు వివాహం నిశ్చయించి లగ్నపత్రిక వేయించారు. ఇంట్లోనే వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తన గ్రామంతో పొరుగున ఉన్న గ్రామంలో పంతుళ్లను సంప్రదించగా ఎవరూ రాలేమని చెప్పారు. దీంతో చేసేది లేక ఆయనే పురోహితుడిగా మారి వివాహం తంతు పూర్తి చేశాడు. తన కుమార్తెతో పాటు బంధువుల కుమార్తె పెళ్లిని అదే వేదికపై నిర్వహించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.