FbTelugu

తండ్రీ కొడుకులను బలిగొన్న ఆర్టీసీ బస్సు

కడప : బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రీకొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం, ఓంపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్ననాగారెడ్డి పల్లికి చెందిన రామిరెడ్డి తన కుటుంబంతో బైకుపై వెళుతూ ఓ లారీని క్రాస్ చేస్తుండగా..

ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న తండ్రీ కొడుకు రామిరెడ్డి, ఉమేశ్‌ మృత్యువాత పడగా భార్య, మరో కొడుకు తీవ్ర గాయాలపాలైనాడు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.